FbTelugu

జీవో నెం.39 పై అనేక అనుమానాలున్నాయి: కన్నా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.39 పై తమకు చాలా అనుమానాలు ఉన్నాయని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. దేవాలయాల భూములపై

గతంలోనూ పోరాటం చేశామని తెలిపారు. ఎందరో భక్తులు టీటీడీకీ భూములను విరాళంగా ఇచ్చారని అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీటీడీ వ్యవహరిస్తోందని అన్నారు. టీటీడీ ఆస్తుల జోలికి వస్తే సహించమని అన్నారు. టీటీడీ ఆస్తుల వేలానికి వ్యతిరేకంగా ఎల్లుండి ధర్నా చేస్తామని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.