FbTelugu

ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పట్లో లేవు

న్యూఢిల్లీ: ఏపి, తెలంగాణలో ఇప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడం లేదని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టే వరకు ఎన్నికల నిర్వహణ ఉండదని స్పష్టం చేసింది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఖాళీలపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాసింది. లేఖపై సమీక్షించిన ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఏపిలో ఈ నెలాఖరుకు మూడు ఎమ్మెల్సీ స్థానాలు, తెలంగాణలో వచ్చే నెల మూడో తేదీ నాటికి ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ సీట్ల కోసం ఆశావహులు పలువురు పోటీపడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.