FbTelugu

దేశంలో కరోనా కేసులు 1.32 లక్షలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేయడంతో రెండు వారాలుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్న విషయం తెలిసిందే.

గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,32,364 పాజిటివ్ కేసులు నమోదు కాగా 2,713 మంది చనిపోయారు. ఇప్పటివరకూ 2,85,74,350 మందికి కరోనా సోకగా..3,40,702 మంది బలయ్యారు. ప్రస్తుతం 16,35,993 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. యాక్టివ్ కేసుల రేటు 6.02 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 92.79 శాతానికి పెరిగడం సానుకూలాంశంగా చెప్పుకోవచ్చు. ఇంకా దేశాలో వ్యాక్సిన్లు వేసే డోసుల సంఖ్య పెరగడం లేదు. తక్కువ సంఖ్యలో ఇవ్వడం మూలంగా ప్రజలు ఎదురు చూపులు చూస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.