FbTelugu

13 జిల్లాల ప్రయోజనం కోసమే వారి పోరాటం: యనమల

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల ప్రయోజనం కోసమే రైతులు పోరాటం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి రైతుల పోరాటం చిరస్మరనీయమన్నారు.

రాష్ట్రం కోసం 34 వేల ఎకరాలను రైతులు త్యాగం చేశారని కొనయాడారు. అలాంటి రాజధాని పట్ల జగన్ ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర 13 జిల్లాల వెన్నెముకను వైసీపీ విరిచేస్తోందని అన్నారు. విశాఖలో వేలాది ఎకరాలపై వైసీపీ కన్నేసిందని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.