FbTelugu

రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాల చోరీ

హైదరాబాద్: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. సైనిక్ పురిలో నివాసముండే దంపతులు తమ కుమారుడి పెళ్లి, విందు కార్యక్రమం కోసం పాతబస్తీలోని ఫలక్ నుమా ప్యాలెస్ కు వెళ్లారు.

పెళ్లికి వెళ్లి వచ్చే లోగా ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. వస్తువులు చిందరవందరగా ఉండడం, లాకర్లు తెరిచి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్దిరోజులుగా నేపాల్ కు చెందిన భీమ్ వాచ్మెన్ గా పని చేస్తున్నాడు. అతనే చోరీ చేసి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. పెళ్లికి వెళ్లిన విషయం పసిగట్టి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు నగదును ఎత్తుకెళ్లాడని యజమాని పోలీసులకు తెలిపారు. సుమారు రూ.1 కోటి విలువ చేసే కిలో బంగారం తో పాటుగా వజ్రాలు, కొన్ని వస్తువులు ఉండే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

You might also like