FbTelugu

థియేటర్లు, పబ్పులు, మాల్స్ మూసివేత?

హైదరాబాద్: కరోనా వైరస్ కేసులు ఉధృతంగా పెరుగుతుండడంతో నియంత్రించేందుకు పలు చర్యలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సిఫారసు చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.

ఇప్పటికే విద్యా సంస్థలను మూసివేన ప్రభుత్వం థియేటర్లు, మాల్స్, పబ్బులు, క్లబ్బులు, రెస్టారెంట్లపై దృష్టా సారించింది. జనం అధికంగా గుమిగూడే ప్రాంతాలను కట్టడి చేయాలని ఆరోగ్య శాఖ కోరింది. థియేటర్లు, మాల్స్, పబ్బులు, క్లబ్బులు, రెస్టారెంట్లను మూసివేయాలని ప్రతిపాదించింది. ఆలస్యం చేస్తే మరింత ముప్పు తప్పదంటూ హెచ్చరికలు చేసింది. థియేటర్ల మూసివేత సాధ్యం కాకుంటే సగం సీట్లతో నడిచేలా నిబంధనలు సవరించాలని స్పష్టం చేసింది.

అయితే థియేటర్ల మూసివేతపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి టి.శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. థియేటర్లు మూసివేయడం లేదని, సీట్ల సంఖ్య కూడా సగానికి తగ్గించడం లేదన్నారు. కరోనా పేరుతో సినిమా షూటింగ్ లను నిలిపివేయడం కుదరని, అలా చేస్తే సినిమా పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోతుందని అన్నారు. మంత్రి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే వైద్య, ఆరోగ్య శాఖ సిఫారసులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని స్పష్టమవుతున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.