FbTelugu

యువకుడు దారుణ హత్య

హైదరాబాద్: ఓ యువకుడు దారుణహత్యకు గురైన ఘటన నగరంలోని అసీఫ్ నగర్ హుడా కాలనీలో చోటుసుకుంది. వివరాల్లోకెళితే.. శ్రవణ్ అనే యువకున్ని స్థానిక హుడానగర్ కాలనీలో కొందరు గుర్తు తెలియని దుండగులు హత్యచేశారు.

ఈ హత్యను ఎవరు చేశారు, ఎందుకు చేశారన్న విషయాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like