FbTelugu

రైతులను వైసీపీ సర్వనాశనం చేసింది: బోండా ఉమ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం రైతులను సర్వనాశనం చేసిందని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. ఈ సంరద్భంగా ఆయన పలు విమర్శలు చేశారు. జగన్ తీరుతోనే ఏపీలో కరోనా కేసుల పెరిగిపోయాయని ఆరోపించారు.

టెస్టింగ్ కిట్లలో కోట్ల రూపాయల స్కాం జరిగిందని అన్నారు. రైతులకోసం జగన్ చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో 50 లక్షల టన్నుల పంట పండితే అందులో 2 లక్షల టన్నుల పంటను కూడా కొనలేదని ఎద్దేవా చేశారు. దీనిపై వైసీపీ స్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

You might also like