FbTelugu

మహిళ గొంతు కోసిన మరో మహిళ

చిత్తూరు: ఇద్దరు మహిళల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఓ మహిళ మరో మహిళను గొంతుకోసింది. ఈ ఘటన జిల్లాలోని మదనపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హేమలత, వరలక్ష్మి అనే ఇద్దరు మహిళలు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో వరలక్ష్మి ఒక్కసారిగా హేమలత గొంతు కోసింది.

అనంతరం హేమలత తల్లి, కుమారునిపైనా వరలక్ష్మి దాడి చేసింది. హేమలత పరిస్థితి విషమించడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీంతో వరలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘర్షణకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

You might also like