FbTelugu

బ్యాంకులోనో మేనేజర్ ఉరేసుకుంది

తిరువనంతపురం: ఏమి కష్టాలు వచ్చాయో ఏమో కాని సలక్షణమైన ఉద్యోగం, ఇద్దరు పిల్లలు ఉన్నా ఒక మహిళా బ్యాంకు మేనేజర్ ఉరేసుకుని తనువు చాలించింది. అది కూడా తను పనిచేస్తున్న బ్యాంకులోనే ఉరేసుకోవడం సంచలనం రేపుతోంది.
పోలీసుల కథనం ప్రకారం తొక్కిలంగడి కెనరా బ్యాంకులో కె.స్వప్న (38) బ్రాంచి మేనేజర్ గా పనిచేస్తున్నది. శుక్రవారం ఉదయం 9 గంటలకు మరో మహిళా ఉద్యోగి విధులకు రాగా ఆమె వేలాడుతూ కన్పించడంతో భయపడింది. వెంటనే బ్యాంకు అలారం నొక్కడంతో చుట్టు పక్కల ఉన్నవారూ చేరిపోయారు.

వెంటనే ఆమెను కిందకి దించి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఘటనా ప్రాంతం నుంచి స్వప్న డైరీని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు. కన్నూరులోని నర్మలగిరిలో నివాసముంటున్న స్వప్న 2020 సెప్టెంబర్ లో తొక్కిలంగడికి బ్రాంచి మేనేజర్ గా బదిలీపై వచ్చారు. ఈమె స్వస్థలం త్రిసూర్ జిల్లాలోని మన్నూతి గ్రామం.

You might also like

Leave A Reply

Your email address will not be published.