FbTelugu

ఉరేసుకుని కానిస్టేబుల్ భార్య మృతి

కృష్ణా: అనుమానాస్పదంగా ఓ కానిస్టేబుల్ భార్య ఉరేసుకొని మృతి చెందిన ఘటన జిల్లాలోని నాగాయలంకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుధారాణి అనే మహిళకు

ఎనిమిదేళ్లక్రితం గొరిపర్తి జగ్గయ్య అనే వ్యక్తి(కానిస్టేబుల్)తో వివాహం అయింది. కాగా నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.