FbTelugu

భార్య బావిలో దూకిందని.. భర్త కూడా

The-wife-jumped-into-the-well--the-husband-too

భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న గొడవతో భార్య బావిలో దూకి ఆత్మహత్య చేసుకోగా.. భర్త కూడా అదే బావిలో దూకిన ఘటన కొత్తగూడెం జిల్లా చర్ల మండలం రాళ్లగూడెంలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం. చీమల సాయికిరణ్, ములుగు జిల్లా రాజుపేటకు చెందిన శైలజ రెండేళ్ల క్రితం పెళ్లైంది. కాగా వీరికి ఓ పాప ఉంది. అయితే ఉదయం భోజన సమయంలో చిన్నపాటి ఘర్షణ వీరి మధ్య జరిగింది. దీంతో అలిగిన సాయికిరణ్ పనిలోకి వెళ్లిపోగా, మనస్తాపం చెందిన భార్య శైలజ గ్రామ శివారులోని ఓ బావిలో దూకేసింది. సమాచారం అందుకున్ భర్త సాయికిరణ్‌ బావి వద్దకు చేరుకోగా.. గ్రామస్థులు శైలజ మృతదేహాన్ని వెలికే తీసే ప్రయత్నాల్లో ఉండగా.. సాయికిరణ్ కూడా బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like