FbTelugu

కేసీఆర్ నిర్ణయంతో మొత్తం ఆగమైంది : రేవంత్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మద్యం అమ్మకాలపై తీసుకున్న ఒక అనాలోచిత నిర్ణయం వలన ఏకంగా 45 రోజులు కఠినంగా పాటించిన లాక్ డౌన్ వృథా అయి పోయిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు విమర్శలు చేశారు. అధిక మొత్తంలో జనం గుమిగూడే మద్యం షాపులను తెరిపించి.. కేవలం ఒక్కరిద్దరు మాత్రమే ఉండే మెకానిక్ షాపులకు అనుమతించలేదని అన్నారు. ప్రభుత్వానికి కేవలం ఆదాయమే ముఖ్యమైతే.. ప్రజలకు కూడా వారి ఆదాయాలే ముఖ్యమని అన్నారు.

You might also like