FbTelugu

కుటుంబం మొత్తం బావిలో దూకింది…

కరోనాకు భయపడి సామూహికంగా ఆత్మహత్య

విజయనగరం: వేపాడ మండలం నల్లబెల్లి లో తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గ్రామస్తులకు కన్నీరు తెప్పించింది.

నల్లబెల్లిలో ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా టెస్టు చేయగా పాజిటివ్ అని స్పష్టమైంది. కుటుంబం మొత్తానికి పాజిటివ్ రావడంతో వారందరూ భీతిల్లిపోయారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే చికిత్స సరిగా లభించదు, ప్రైవేటు వెళ్దామంటే చేతిలో డబ్బులు లేకపోవడంతో ఆత్మహత్యనే శరణ్యమని భావించారు. తల్లి, తండ్రితో పాటు కుమారుడు, కోడలు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులతో పాటు బావిలో దూకి కొడుకు కోడలు ఆత్మహత్య కు పాల్పడ్డారు. ఈ విషయం తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.