FbTelugu

తిమింగలం మింగకుండా ఊసేసింది…

వాషింగ్టన్: భూమి మీద నూకలు ఉన్నాయంటే ఇదేనేమో మరి. చావు అంచుల దాకా వెళ్లి బయటపడ్డాడు. ఆయనే అమెరికాకు చెందిన మైకెల్ ప్యాకర్డ్. ఎలా బయటపడింది ఆయనే చెప్పాడు.

మైకెల్ (56) ఎప్పటి మాదిరే చేపల వేట కోసం మసాచుసెట్స్ లోని కేఫ్ కాడ్ ప్రాంతానికి వెళ్లి సముద్రంలోకి దూకాడు. ఈదుతుండగా హంప్ బ్యాక్ తిమింగలం నోట్లోకి వెళ్లాడు. ఇక తాను బతికే అవకాశం లేదని భావించాడు. బతుకుపై ఆశలు వదిలేసుకుని నిమిషం పాటు తిమింగలం నోట్లనే బిక్కు బిక్కుమంటూ గడిపాడు. తిమింగలం ఏమనుకున్నదో ఏమో కాని అతన్ని మింగేయకుండా సముద్రం పైకి వచ్చి ఒక్కసారిగా ఊమ్మెసింది. సముద్రం ఉపరితలంపై పడిన ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. బలంగా ఉమ్మెయడంతో తీవ్ర గాయాలు అయ్యాయని, బయటపడిన తనకు ప్రొవిన్స్ టౌన్ రెస్క్యూ స్క్వాడ్ సాయం చేసి ఒడ్డుకు చేర్చిందని చెప్పాడు. తిమింగలం నోట్లో చిక్కుకున్నప్పుడు 15, 12 సంవత్సరాల వయస్సు ఉన్న కుమారుల గురించి దిగాలుపడినట్లు మెకెల్ తెలిపాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.