FbTelugu

‘నా భర్త హత్యకు ఎమ్మెల్యేనే కారకుడు’

* హత్యకు గురైన సుబ్బయ్య భార్య తీవ్ర ఆరోపణలు
కడప: తన భర్త హత్యకు స్థానిక ఎమ్మెల్యే రాచమల్లునే కారకుడంటూ.. అత్యంత దారుణంగా హత్యకు గురైన టీడీపీ నేత సుబ్బయ్య భార్య అపరాజిత ఆరోపించారు. ఎమ్మెల్యేతో పాటూ పలువురిపై ఆరోపణలు చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన భర్తపై ఉన్న కేసులన్నీ ఎమ్మెల్యే రాచమల్లు పెట్టించినవేనని అన్నారు.

రాజకీయంగా ఎదుగుతున్నాడని హత్య చేయించారన్నారు. తన భర్త హత్యపై ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. తన భర్త మొబైల్ ను కూడా మాయం చేశారన్నారు. మొబైల్ లభిస్తే అన్ని వాస్తవాలు బయటపడతాయని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.