FbTelugu

నమోదు కాకున్నా వ్యాక్సిన్ ఇస్తారు

అమరావతి: అన్ని ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో నమోదు చేసుకోకున్నా వ్యాక్సిన్ వేస్తారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆసుపత్రుల జాబితాను cowin.gov.in వెబ్ సైట్లో చూడొచ్చని తెలిపింది.

ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోలేకపోయినా దగ్గర్లోని సెంటర్లకు స్వయంగా వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెసులుబాటు కల్పించారు. 60 ఏళ్లు దాటిన వారు ఆధార్ కార్డు లేదా ఏదైనా ధ్రువపత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. 45 నుంచి 59 ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు డాక్టర్ సంతకం చేసిన ధ్రువపత్రాన్ని సమర్పించాలి. ఇలాంటి ధ్రువపత్రం లేనివారు రక్త పరీక్షల రిపోర్టులు, మందుల చీటీ లేదా ఇతర ఆధారాలు ఏమైనా చూపిస్తే సరిపోతుంది. వేయించుకున్న తరువాత ఆసుపత్రుల్లోని డాక్టర్ అవసరమైన ధ్రువపత్రాన్ని ఇస్తారు. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఇంకా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. వీరు ఏ వ్యాక్సినేషన్ సెంటర్ కైనా వెళ్లి వేయించుకోవచ్చని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.