FbTelugu

వ్యాక్సిన్… నిమిషానికి 27 లక్షల హిట్స్

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఉధృతితో వ్యాక్సిన్ కు డిమాండ్ అమాంతం పెరిగింది. వ్యాక్సిన్ ఇస్తామంటే చాలు జనం వెంటనే వాలిపోయే పరిస్థితులు ఉన్నాయి.

ఈ తరుణంలో కేంద్రం ప్రభుత్వం ఇవ్వాళ్టి నుంచి వ్యాక్సిన్ వేయించుకునేందుకు రిజిస్ట్రేషన్ ప్రారంభించారు. వ్యాక్సినేషన్ కోసం ఏర్పాటు చేసిన కోవిన్ వెబ్ సైటుకు ప్రతి నిమిషానికి ఏకంగా 27 లక్షల హిట్లు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లు నిర్ధారించే స్లాట్ల ఆధారంగా వ్యాక్సినేషన్ జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. రానున్న రోజుల్లో స్లాట్స్ సంఖ్య పెరుగుతుందని పేర్కొంది. వ్యాక్సినేషన్ల స్లాట్స్ లభ్యం కాకుంటే, కొద్ది సేపటి తరువాత మరోసారి ప్రయత్నించాలని సూచించింది.

మే 1వ తేదీ (శనివారం) నుంచి 18 ఏళ్లు పైబడిన అందిరికీ వ్యాక్సిన్ వేయబోతున్నారు. ఇందుకోసం బుధవారం సాయంత్రం నుంచి ఆన్ లైన్ లోనే  రిజిస్ట్రేషన్ కు అనుమతించారు. వ్యాక్సిన్ వేయించుకునేందుకు సిద్ధమైన వారు  https://www.cowin.gov.in/home కు తొలుత లాగిన్ కావాలి. ఆ తరువాత  register/sign-in క్లిక్ చేసి తమ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.