FbTelugu

రెండు రోజులే అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. కరోనా తీవ్రత దృష్ట్యా రెండు రోజులకే సభను పరమితం చేయాలని నిర్ణయించారు.

స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది.  సభలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం సహా నాలుగు బిల్లులు, నాలుగు ఆర్డినెన్సులను ప్రవేశపెట్టనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. మండలి సమావేశాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి.

You might also like