FbTelugu

ధర్నాకు దిగిన గిరిజనులు

శ్రీకాకుళం: జీవో నెం.3 రద్దును నిరసిస్తూ గిరిజన సంఘాల పిలుపు మేరకు ఇవాళ శ్రీకాకులం మన్యం గిరిజనులు బంద్ పాటిస్తున్నారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో గిరిజనులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు.

దీంతో ఆ ప్రాంతంలోని షాపులు ఉదయం నుంచే మూతపడ్డాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో నూటికి నూరుశాతం ఉద్యోగాలను గిరిజనులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో నెం.3 పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఏజెన్సీ బంద్ కు ఆయా పార్టీలు తమ మద్దతును తెలిపాయి.

You might also like