FbTelugu

ముఖ్యమైన కేసుల విచారణ లైవ్ టెలికాస్ట్ చేయాలి: ఉండవల్లి

అమరావతి: ముఖ్యమైన కేసుల విచారణ లైవ్ టెలికాస్ట్ చేయాలని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్చువల్ కోర్టులు ఏర్పాటు చేయాలని అన్నారు. సీఎం జగన్ కేంద్రానికి రాసిన లేఖ ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతోనే ప్రచారం చేశారని అన్నారు.

అయితే న్యాయవ్యవస్థ మీద సీఎం లు లేఖ రాయడం కొత్తేమి కాదన్నారు. ఏపీ ప్రజా ప్రతినిధులకు సంబంధం ఉన్న కేసులను వర్చువల్ కోర్టుల్లో విచారించాలని అన్నారు. వర్చువల్ కోర్టులపై తన సూచనలను సీజేకు మెయిల్ చేసినట్టుగా తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.