FbTelugu

ఆక్సిజన్ అందక 11 మంది మృతి

చెన్నై: దేశంలో కరోనాతో చికిత్స పొందుతున్న రోగులు ఆక్సిజన్ అందక ఏదో ఒక ప్రాంతంలో పదులకొద్దీ చనిపోతున్నారు. ఒక ఆక్సిజన్ కొరత ఘటన మరువక ముందే మరో ఘటన జరుగుతుండడం విషాదం.

తమిళనాడు లోని చెంగల్ పట్టు ప్రభుత్వాస్పత్రిలో విషాదం చోటు చేసుకున్నది. ఈ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు మృతి చెందారు. వెంటనే అప్రమత్తమైన వైద్యులు, నర్సులు మిగతా రోగులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని డీన్ జాన్ లుయిస్ తెలిపారు. ఈ దారుణ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తమిళనాడు లో మంగళవారం నాడు 21వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 144 మంది కరోనా రోగులు చనిపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.