FbTelugu

ఉత్తరాది రాష్ట్రాలకు మిడతల ముప్పు

న్యూఢిల్లీ: ఇప్పటికే కరోనా ప్రభావంతో దేశంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటూ ఉండగా.. తాజాగా ఉత్తర భారతావనికి మిడతల రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి పాకిస్థాన్ మీదుగా కోట్ల సంఖ్యలో మిడతలు వలస వస్తున్నాయి.

వీటి ప్రభావంతో రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, యూపీలలో పంటలు సర్వనాశనం అయిపోతున్నాయి. జూన్ జులైలో తెలుగు రాష్టాలకు మిడతలు వచ్చే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఇవి ఒక్కసారి పంటలపై వాలితే గంటల్లోనే పంటను నామరూపం లేకుండా తినేస్తాయని తెలుపుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.