FbTelugu

గుంటూరులో ఇద్దరు సీఐల సస్సెన్షన్

గుంటూరు: జిల్లాలో ఇద్దరు సీఐ లను సస్పెండ్ చేస్తూ రేంజ్ ఐజీ ప్రభాకరరావు ఆదేశాలు జారీ చేశారు.

అక్రమ నిర్భంధం కేసులో సీఐ లు మల్లికార్జునరావు, ప్రభాకరరావు లను సస్పెండ్ అయ్యారు. అక్రమ నిర్భంధం కేసును ఈ నెల 28 న సీబీఐ విచారించనున్న నేపథ్యంలో చర్యలు తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.

క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ముగ్గురిని సీసీఎస్ పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తరువాత కోర్టులో హాజరుపర్చకుండా విచారణ పేరుతో నిర్బంధించారు. డబ్బుల కోసం తమను చిత్రహింసలకు గురిచేశారంటూ ముగ్గురు హైకోర్టును ఆశ్రయించగా, విచారించిన హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

నిజాంపట్నం కేసులో మరికొందరు…

నిజాంపట్నం లో పేకాట స్థావరం పై దాడులకు సంబంధించి పేకాట రాయుళ్లతో కుమ్మక్కై లాభార్జన ఆశ పడిన పోలీసులపై గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావు వేటు వేశారు.

నిజాంపట్నం ఎస్ఐ పై వేటు వేసి విఆర్ కి బదిలీ, నిజాంపట్నం పోలీస్ కానిస్టేబుల్ సస్పెన్షన్, ముగ్గురు హోమ్ గార్డ్ లపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పిడుగురాళ్ల ఎస్బి కానిస్టేబుల్, నిజాంపట్నం ఎస్బి కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేశారు.

You might also like