FbTelugu

ప్రాణంతో ఉండగానే బావిలో పడేశారు

వరంగల్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బావిలో 9 మంది మృతి కేసులో ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఈ ఘటనకు ముందు మృతుడు మక్సూద్ బీహార్ యువకులతో ఫోన్ మాట్లాడాడు.

దీంతో ఇద్దరు బీహార్ యువకులు సంజయ్, మోహన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుల పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం.. బతికుండగానే వారిని బావిలో పడవేయడంలో వారి ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని తెలిపారు. ఈ కేసులో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కూడా కీలకంగా మారనుంది. ఏడు మృతదేహాల్లో పాయిజన్ ఆనవాళ్లు ఉన్నట్టు భావిస్తున్నారు. ఈ కేసును మొత్తం 9 బృందాలు దర్యాప్తు చేస్తున్నారు.

You might also like