FbTelugu

రెండు ఛానళ్ల విచారణపై సుప్రీకోర్టు స్టే

న్యూఢిల్లీ: ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ5 న్యూస్‌ ఛానల్స్‌ పై ఏపి సిఐడి విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. జస్టిస్‌ డివై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఈ రెండు ఛానళ్ళ పిటీషన్లను ఇవాళ విచారించింది.

విచారణ సందర్భంగా జస్టిస్‌ చంద్రచూడ్‌ మాట్లాడుతూ ‘నిన్న మృతదేహాన్ని నదిలో పడేస్తున్న దృశ్యాన్ని ఒక టివి ఛానల్ చూపించింది. మరి ఆ ఛానల్‌పై దేశద్రోహం కేసు పెట్టలేదా?’ అని వ్యాఖ్యానించారు. తనను విమర్శించే మీడియా గొంతు నొక్కేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఈ రెండు ఛానల్స్‌ వాదించాయి. ఛానళ్ల తరఫున సీనియర్‌ అడ్వకేట్లు శ్యామ్‌ ధావన్‌, సిద్ధార్థ్‌ లూథ్రా వాదించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.