FbTelugu

కరోనా మృతులకు పరిహారం చెల్లించాలి: సుప్రీంకోర్టు స్పష్టీకరణ

పరిహారం చెల్లించేందుకు నిధులు లేవంటూ కేంద్రం నాటకం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ తో చనిపోయిన కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, ఎంత పరిహారం చెల్లిస్తారో ఆరు వారాల్లో తెలియచేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్రానికి స్పష్టం చేసింది.

పరిహారం చెల్లించేందుకు ఖజానాలో నిధులు లేవని కేంద్రం తరఫు అటార్నీ జనరల్ స్పష్టం చేయడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద పరిహారం ఇవ్వడం తప్పనిసరి కాదని కేంద్రం అడ్డంగా వాదించింది. అయినా పరిహారం కచ్చితగా ఇచ్చి తీరాల్సిందేనని సుప్రీంకోర్టు ఆల్టిమేటం ఇచ్చింది. ఆపై సరిపడా నిధులు లేవనే విధంగా అబద్దపు మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కరోనా వైరస్ మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం చెల్లిస్తారనేది ఆరు వారాల్లో తెలియచేయాలని సూచించింది. బాధితులకు పరిహారం చెల్లించాలని సిఫారసు చేయడంతో జాతీయ విపత్తుల నిర్వహణ కమిటీ విఫలైందని సుప్రీంకోర్టు తలంటింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.