FbTelugu

విద్యార్థి మరణిస్తే రూ.1 కోటి పరిహారం: సుప్రీం హెచ్చరిక

న్యూఢిల్లీ: పరీక్షల సందర్భంలో ఎవరైనా విద్యార్థి చనిపోతే రూ.1 కోటి చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. పరీక్షలు జరుగుతున్న సమయంలో కరోనా ఉధృతి పెరిగితే దానిపై సత్వర నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రాలను సూచించింది.
రాష్ట్రాల బోర్డు పరీక్షల నిర్వహణపై ఇవాళ సుప్రీంకోర్టు లో విచారణ జరిగింది. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. పరీక్షలు నిర్వహించాలా? రద్దు చేయాలా? అనే అంవంపై శుక్రవారం మధ్యాహ్నం తీర్పు ఇవ్వనున్నది. ఇప్పటికే 10, 12 తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఏపి ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అఫిడవిట్ లో సమాచారం స్పష్టంగా లేకపోవడంతో సరి చేసుకుని రావాలని బెంచ్ ఆదేశించింది. 21 రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేయగా, ఏపి ప్రభుత్వం మాత్రం నిర్వహిస్తామని మొండిగా వాదిస్తున్నది.

ఏపి ప్రభుత్వ దాఖలు చేసిన అఫిడవిట్ తప్పుల తడగా ఉందని సుప్రీంకోర్టు మండిపడింది. పక్కా సమాచారం ఇవ్వాలని సుప్రీంకోర్టు అడిగితే ఇలాగా ఇచ్చేది అని ప్రశ్నించింది. అఫిడవిట్‌లో పక్కా సమాచారం ఎక్కడా కనిపించలేదని, 15 రోజులు ముందుగా చెబుతామన్నారు, 15 రోజుల సమయం సరిపోతుందని ఎలా చెబుతారని సుప్రీంకోర్టు నిలదీసింది. పరీక్షల నిర్వహణ సిబ్బంది వివరాలు ఏవీ ఇవ్వలేదు. ప్రభుత్వమే అన్నిరకాల లాజిస్టిక్ వసతులు కల్పించాలి. విద్యార్థులతో పాటు సిబ్బంది రక్షణ బాధ్యత ప్రభుత్వానిదని స్పష్టం చేసింది. గాలి, వెలుతురు ఉండే గదుల్లో పరీక్షల నిర్వహణ వివరాల్లేవని అఫిడవిట్ ను సుప్రీంకోర్టు తిప్పి పంపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.