FbTelugu

స్టైరిన్ ట్యాంక్ పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చింది: జీఎం

అమరావతి: విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో లీకైన స్టైరిన్ ట్యాంక్ పూర్తిగా అదుపులోకి వచ్చిందని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ జీఎం మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక గడ్డకట్టిన ట్యాంక్ నుంచి ఎలాంటి వాయువులు బయటకు రావని తెలిపారు.

విశాఖ పోర్టులోనూ రెండు స్టోరేజీ ట్యాంకులు ఉన్నాయని తెలిపారు. అయితే ఆ ట్యాంకుల్లో ఉష్ణోగ్రతలు కంట్రోల్ లో ఉండేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఉత్పత్తి లేనందున లిక్విడ్ ను వెనక్కి పంపే ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. గ్రామాల్లో జనజీవనానికి ఇబ్బంది రాకుండా కమిటీ సూచనలు ఇస్తోందని తెలిపారు.

You might also like