FbTelugu

అమెరికా ఖైదీల వింత పోకడ

వాషింగ్టన్: అమెరికాలోని ఓ జైళ్లో ఖైదీల వింత చేష్టలు పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తమకు కరోనా సోకితే జైళ్లనుంచి రిలీజ్ కావొచ్చన్న ఆలోచనతో కొందరు ఖైదీలు కావాలనే కరోనా వైరస్ ను ఇతరుల నుంచి అంటించుకున్నారు.

దీనికి సంబంధించిన తతంగం మొత్తం సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియోను అక్కడి జైలు అధికారి విడుదల చేశారు. ఇప్పటికే అమెరికాలో ప్రపంచంలోనే అధిక కేసులు నమోదౌతున్న విషయం తెలిసింది.

You might also like