FbTelugu

ఇండియా సేఫ్ కాదు… వెనక్కి రండి: యుఎస్ ఆదేశం

వాషింగ్టన్: ఇండియాలో కరోనా కేసుల తీవ్రత అంతకంతకూ పెరుగుతుండడంతో యుఎస్ ప్రభుత్వం తమ దేశ పౌరులను స్వదేశానికి తిరిగి వచ్చేయాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

యునైటెడ్ ఏయిర్ లైన్స్, ఏయిర్ ఇండియా వీక్లీ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయని, ఈ విమానాల్లో సాధ్యమైనంత త్వరగా యుఎస్ చేరుకోవాలని కోరింది. ప్యారిస్, ఫ్రాంక్ ఫర్డ్, దోహ ల ముగా ఏయిర్ ఫ్రాన్స్, లుఫ్తాన్సా, ఖతార్ ఏయిర్ వేస్ విమానాలు నడిపిస్తున్నాయన్నారు. ఈ విమానాల్లో కూడా వచ్చేందుకు అవకాశం ఉన్నందున, ఇండియాలో ఉన్న యుఎస్ పౌరులందరూ స్వదేశానికి రావాలని స్టేట్ హెల్త్ డిపార్ట్ మెంట్ కోరింది. విమానం ఎక్కే సమయం కంటే 72 గంటల ముందుగా కరోనా టెస్టు రిపోర్టు తీసుకోవాలన్నారు. గతవారం కూడా యుఎస్ ప్రభుత్వం ఇదే విధమైన హెచ్చరిక చేసింది. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతిపై సెంటర్ ఫర్ డిజీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) నాలుగో స్థాయి హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. ఈ హెచ్చరికలను అనుసరించే యుఎస్ స్టేట్ హెల్త్ డిపార్ట్ మెంట్ మరోసారి ఇండియాలో ఉన్న తమ దేశ పౌరులను అప్రమత్తం చేస్తూ వెనక్కి రావాల్సిందిగా ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.