FbTelugu

ఆ ఇద్దరు ఎమ్మెల్యేల అరెస్టు కు రంగం సిద్ధం

ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాములు ఆదేశం

హైదరాబాద్: దళితులను కించపర్చిన కేసులో ఇద్దరు ఎమ్మెల్యేల అరెస్టు కు రంగం సిద్ధమవుతోంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదైన ఎమ్మెల్యేలు మంచి రెడ్డి కిషన్ రెడ్డి, అహ్మద్ బలాలాను అరెస్ట్ చేయాలని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు కె. రాములు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

sc st commission member ramulu

ఇవాళ రాములు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. యాచారం మండలం నంది వనపర్తి గ్రామంలో ఫార్మా సిటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎంపీపీ అధ్యక్షురాలు కొప్పు సుకన్య ను కులం పేరుతో పరుష పదజాలంతో దూషించారు. ఎమ్మెల్యే మనుషులు భౌతిక దాడికి దిగడంతో ఆమె కింద పడిపోయి అస్వస్థతకు గురయ్యారు. హాస్పిటల్ చేరిన ఆమె చికిత్స తీసుకుంటూ, రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పరిశీలించిన పోలీసులు అధికార పార్టీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.

బీజేపీ దళిత మోర్చా జాతీయ కార్యదర్శి బంగారు శృతిని దూషించిన కేసులో మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలపై ఛాదర్ ఘాట్ పోలీసు స్టేషన్ లో నాలుగు రోజుల క్రితం ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.  బంగారు శృతి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన బంగారు లక్ష్మణ్ కుమార్తె.

You might also like

Leave A Reply

Your email address will not be published.