FbTelugu

అమెరికాలో దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ వ్యాప్తి

వాషింగ్టన్: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి ఓ కుదుపు కుదిపేయగా.. తాజాగా కరోనా కొత్త వేరియంట్స్ తాజాగా మరోమారు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్ లో ఉద్భవించిన స్ట్రెయిన్ కంటిమీద కునుకు లేకుండా చేస్తుండగా.. తాజాగా అమెరికాలోకి దక్షిణాఫ్రికా కరోనా స్ట్రెయిన్ అమెరికాకు వ్యాపించింది.

సౌత్ కరోలినాలో 2 కేసులు నమోదైనాయి. యూకేలో వెలుగులోకి వచ్చిన కొత్త కరోనాతో పోలిస్తే సౌత్ ఆఫ్రికా స్ట్రెయిన్ మరింత వేగంగా వ్యాపిస్తున్నట్టుగా గుర్తించారు. కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో పౌరులు జాగ్రత్తగా ఉండాలని, కరోనా నియమాలను పాటించాలని అధికారులు సూచించారు. సౌత్ ఆఫ్రికా స్ట్రెయిన్ ప్రభావం అధికమని సీడీసీ ఆందోళన వ్యక్తం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.