FbTelugu

రెండో వారంలో నైరుతీ రుతు పవనాలు

విశాఖపట్నం: వచ్చే నెల రెండో వారంలో తెలుగు రాష్ట్రాలను నైరుతీ రుతు పవనాలు తాకనున్నాయి. రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు ఒక అంచనాకు వచ్చారు.

నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, కొమోరిన్‌, మాల్దీవులు  ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రానున్న 48 గంటల్లో ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. ఈ కారణంగా జూన్‌ 1వ తేదీ నాటికి కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకనున్నాయి. ఆ తరువాత జూన్‌ 9, 10 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశాలున్నాయి.

ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఈ నెల 31న అల్పపీడనం ఏర్పడనున్నది. అల్ప పీడనం ఏర్పడిన తర్వాత.. నైరుతి పవనాలు మరింత వేగంగా కదలనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు దక్షిణ తమిళనాడు, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.

You might also like