FbTelugu

దారుణ హత్యకు గురైన మీసేవా నిర్వాహకుడు

గుంటూరు: మీసేవా నిర్వాహకుడు దారుణ హత్యకు గురైన ఘటన జిల్లాలోని దర్గి మండలం, అడిగొప్పలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాసరావు అనే వ్యక్తి మీసేవా నిర్వాహకునిగా పనిచేస్తున్నాడు.

కాగా ఇవాళ శ్రీనివాసును కొందరు వ్యక్తులు కత్తులతో అతి దారుణంగా అతని ఆఫీసులోనే నరికి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. పొలం వివాదాలతోనే శ్రీనివాసరావును హత్యచేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

You might also like