FbTelugu

143 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

ముంబయి: గత కొంతకాలంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లోనే ముగిశాయి. గడిచిన వారం రోజుల్లోనే సెన్సెక్స్ 45 వేల మార్కుని దాటి ఘరిష్ట స్థాయికి ఎగిసింది. కాగా ఇవాళ సెన్సెక్స్ 143 పాయింట్లు నష్టపోయి 45,959 కి చేరింది.

అదే సమయంలో నిఫ్టీ కూడా 50 పాయింట్లు కోల్పోయి 13,478 వద్దకు చేరింది. ఇవాళ లాభపడిన రంగాల్లో ఐటీసీ, నెస్లే ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్ ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.