FbTelugu

పరుగెత్తుతున్న రైలు… ఇద్దరు దుర్మరణం

విశాఖపట్నం: దువ్వాడ రైల్వే స్టేషన్ లో హృదయవిదారకరమైన సంఘటన చోటు చేసుకుంది. సీఆర్పీఎఫ్ లో పనిచేస్తున్న కే.వీ.రమణారావు తన భార్యతో కలిసి హైదరాబాద్ నుండి దువ్వాడ అత్తవారింటికి బయలుదేరాడు. దువ్వాడకు రైలులో వస్తుండగా శనివారం అర్ధరాత్రి ఒంటి గంట అయింది. అర్థరాత్రి రైలు దువ్వాడ రైల్వే స్టేషన్ కి చేరుకున్నా నిద్రమత్తులో ఉన్న భార్యా, భర్త దిగలేదు. నిద్ర మత్తు నుంచి తేరుకుని సరికే రైలు కదిలింది. ఆ కంగారులో నడుస్తున్న రైలు లోంచి కిందకు దిగే ప్రయత్నంలో భార్యాభర్తలిద్దరూ రైలు కింద పడి మృతి చెందారు. కే.వీ.రమణ రావు స్వగ్రామం విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని ఎదుల్లావలస గ్రామం. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో స్థిర పడ్డారు. వీరికి ఇంజనీరింగ్ చదువుతున్న బాబు, టెన్త్ క్లాస్ చదువుతున్న కుమార్తె ఉన్నారు.

You might also like