FbTelugu

అధికార పార్టీ.. భారీగా నగదు, మద్యం పంపిణీ

* రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన నక్రేకల్ ఎమ్మెల్యే అనుచరులు
హైద్రాబాద్ : రేపు జరగనున్న గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల తరుణంలో అధికారపార్టీ నేతలు ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు భారీగా నగదు, మద్యం పంపిణీకి తెరలేపారు. నగరంలోని గడ్డిఅన్నారంలో కొందరు నగదు, మద్యం పంచుతుండగా.. స్థానికులు వారిని పట్టుకున్నారు. వారిని అనంతరం పోలీసులకు అప్పగించారు. వారి వద్ద భారీగా నగదు మద్యం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.

వారిని విచారించగా.. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అనుచరులమని ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. వారి నుంచి భారీగా నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి గడ్డిఅన్నారం ఎన్నికల ఇంచార్జ్ గా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉన్న విషయం తెలిసిందే. స్థానికేతరులు పట్టణం విడిచి వెళ్లాలని నిన్న డీజీపీ హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారంటూ ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా గడ్డిఅన్నారం ప్రజల ఆందోళన చేపట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.