FbTelugu

మేము అనుకున్న ఫలితాలు రాలేదు: కేటీఆర్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా టీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చిన ఓటర్లకు మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ధన్యవాదాలు తెలిపారు.

ఈ ఎన్నికల్లో జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి పార్టీ ఆదేశాల మేరకు పనిచేసి ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. ఇవాళ రాత్రి 8.25 నిమిషాలకు టీఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ ఫలితం మేము ఆశించిన విధంగా రాలేదన్నారు. ఇప్పుడు గెలుపొందిన 56 కు అదనంగా మరో 25 సీట్లు వస్తాయని ఆశించామని ఆవేదన వ్యక్తం చేశారు. 12 సీట్లలో పదుల సంఖ్య ఓట్లతో తమ అభ్యర్థులు ఓటమిపాలయ్యారని ఆయన వివరించారు.  మేయర్ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఇంకా  రెండు నెలల సమయం ఉందని, పార్టీ నాయకులందరూ కూర్చుని అభ్యర్థిని ఖరారు చేస్తారని ఆయన చెప్పారు.

చాలా సమయం పాటు మీడియా సమావేశం నిర్వహించే కేటీఆర్ ఇవాళ కేవలం ఐదు నిమిషాల్లో సమావేశం ముగించి వెళ్లిపోయారు. మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వస్తుందన్న భయంతో త్వరగా ముగించి వెళ్లిపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.