హైదరాబాద్: లాక్ డౌన్ లో ఆయా రాష్ట్రాల్లో చిక్కుకు పోయిన వలస కూలీల బాధ్యత కేంద్రమే చూసుకోవాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
లాక్ డౌన్ సడలింపులపై కేంద్రం ప్రకటన చేసి చేతులు దులుపుకోవడం సరికాదని అన్నారు. తెలంగాణలో 15 లక్షల మంది వలస కూలీలు ఉన్నారని తెలిపారు. వలస కార్మికులను తరలింపునకు ఉచితంగా రైళ్లను నడపాలని తెలిపారు.