తిరుమల: భారీ వర్షాలతో తిరుమల ఆలయం వరదనీటితో నిండిపోయింది. మాడ వీధుల్లో నాలుగైదు అడుగులకు తక్కువ కాకుండా నీళ్లు చేరుకున్నాయి.
నివర్ తుఫాన్ ప్రభావం చిత్తూరు జిల్లాపై అధికంగా ఉంది.
భారీ వృక్షాలు పడిపోతుండడంతో మెట్ల మార్గాన్ని ఈ ఉదయం మూసివేశారు. కిందకు వెళ్లే ఘాట్ రోడ్డులో చెట్లు పడిపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. అటవీ సంరక్షణ సిబ్బంది రంగంలోకి దిగి చెట్లను తొలగిస్తున్నట్లు మిగతా ప్రాంతాల్లో కూలిపోతున్నాయి. ఆలయ పరిసన ప్రాంతాల్లో నీరు ఎక్కువగా చేరుకోవడంతో భక్తులు ఇక్కట్ల పాలయ్యారు.