FbTelugu

సుప్రీంలో రఘురామ కేసు విచారణ నేడే

న్యూఢిల్లీ: నరసాపురం వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణమరాజు కేసుపై సుప్రీంకోర్టు ఇవాళ మధ్యాహ్నం విచారించనున్నది.

మధ్యాహ్నం సుప్రీంకోర్టు జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయిలతో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు రానుంది. రాజద్రోహం, తదితర కేసులను మోపి ఎపి సిఐడి అరెస్టు చేసిన రఘురామ కు సికింద్రాబాద్‌ మిలిటరీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేసి తమకు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఈనెల 17వ తేదీన ఆదేశించిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు నియమించిన జ్యూడిషియల్ ఆఫీసర్ నాగార్జున రావు సమక్షంలో మిలిటరీ ఆస్పత్రిలో  వైద్యపరీక్షలు నిర్వహించి, తెలంగాణ హైకోర్టు ద్వారా గురువారం నాడే  సుప్రీంకోర్టుకు పంపించారు. ఇదిలా ఉండగా తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ రఘురామ వేసిన ఎస్‌ఎల్‌పికి (స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌) కౌంటర్‌ గా ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ కూడా సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.