FbTelugu

ప్రశ్నించే గొంతు నొక్కేస్తున్నారు: భట్టి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు నొక్కేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

స్వరాష్ట్రం సాధించుకొని ఆరేళ్లయినా ప్రాజెక్టుల లక్ష్యాలు మాత్రం నెరవేరలేదన్నారు.   శ్రీశైలం నుంచి నీరు నాగార్జున సాగర్ కు రాకుంటే ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలు ఎడారులుగా మారుతాయన్నారు. ఏపీ ప్రాజెక్టుల అక్రమ నిర్మాణాలతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారని అన్నారు.

You might also like