FbTelugu

రోజా, డిప్యూటీ సీఎంల మధ్య ప్రోటోకాల్ రగడ

చిత్తూరు: నగరి ఎమ్మెల్యే రోజాకు, డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి మధ్య ప్రోటోకాల్ రగడ రాజుకుంది. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంతో కలిసి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పుత్తూరులో సమావేశం నిర్వహించారు. పుత్తూరులో వివాదాస్పద స్థలంలో కల్యాణమండపం నిర్మాణం కోసం నారాయణ స్వామి కలెక్టరుతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.

తన నియోజక వర్గంలో నారాయణ స్వామి పర్యటనపై రోజా ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు తెలియకుండా కార్యక్రమాలు చేపట్టడంపై తీవ్రస్థాయిలో మండి పడ్డారు. తన నియోజక వర్గంలో ఇరత ఎమ్మెల్యేలకు పనేంటని ప్రశ్నించారు. ఈ ఘటనపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే తాను డిప్యూటీ సీఎంగా రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్తానని నారాయణ స్వామి స్పష్టం చేశారు.

You might also like