FbTelugu

కరోనా పేరుతో అర్చకుడు నరబలి

భువనేశ్వర్ : ఒడిషా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. కరోనా నుంచి విముక్తి పేరుతో ఓ అర్చకుడు ఏకంగా నరబలి ఇచ్చిన ఘటన కటక్ జిల్లాలో నర్సింగ్ పూర్ లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక నర్సింగ్ పూర్ బంధముండలో బ్రాహ్మణీదేవి ఆలయంలో సంసారి హోజా అనే అర్చకుడు కరోనా నుంచి విముక్తి పేరుతో ఓ వ్యక్తిని నరబలి ఇచ్చాడు. సోరజ్ కుమార్ ప్రధాన్ (52) అనే వ్యక్తిని బలి ఇచ్చాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. బలి ఇచ్చేందుకు ఉపయోగించిన కత్తులు స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like