FbTelugu

లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటింది

పది రోజుల్లో హైదరాబాద్ లో కూడా వంద దాటుతోందా

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్ తో పోటీపడుతున్నాయి. కరోనా సమయంలో కూడా ధరలు పెంచుకుంటూ వెళ్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారు.

శనివారం పలు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌పై 19 నుంచి 30 పైసల పెరుగుదల నమోదు కావడంతో ధరలు రూ.100 దాటడం కలవరపెడుతున్నది. ముంబయి మహానగరంలో లీటరు పెట్రోల్‌ ధర రూ.100 దాటడంతో వాహనదారులు షాక్ కు గురయ్యారు. ఇక్కడ లీటరు పెట్రోల్ ప్రస్తుతం రూ.100.19, డీజిల్ ధర లీటరుకు 92.17 పెరిగినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఢిల్లీలో పెట్రోల్ రేటు లీటరుకు రూ.93.94 ఉండగా డీజిల్‌ రూ.84.89 గా ఖరారు చేశారు. దేశంలో మే4 నంచి పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరగడం వరుసగా ఇది 15వ సారి. నగరవాల వారీగా హైదరాబాద్ లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 97.63, డీజిల్‌ రూ. 92.54, కోల్‌కతా  పెట్రోల్‌ రూ. 93.97, డీజిల్‌ రూ. 87.74, చెన్నై పెట్రోల్‌ రూ. 95.51, డీజిల్‌ రూ. 89.65, బెంగళూరు పెట్రోల్‌ రూ. 97.07, డీజిల్‌ రూ. 89.99 గా ఉంది. వారం పది రోజుల్లో హైదరాబాద్ నగరంలో కూడా లీటర్ పెట్రోల్ ధర రూ.100 చేరుకోనున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.