FbTelugu

బాలిక మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు

The-police-who-solved-the-girls-missing-case

హైదరాబాద్: హయత్ నగర్ లో బాలిక మిస్సింగ్ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద అంబర్ పేటలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న14 సంవత్సరాల బాలిక తండ్రికి స్కూల్ కి వెళ్తున్నా అని ఇంట్లో చెప్పి వెళ్లింది. కాని తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆ తండ్రి పోలీసులు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి బాలిక మహబూబ్ నగర్ లో ఉన్నట్టు పోలీసులు ట్రేస్ చేశారు. తన తండ్రి హోటల్ లో పనిచేసే అబ్బాయితో మహబూబ్ నగర్ వెళ్లినట్టు తెలిపారు. బాలికని తీసుకుని వెళ్లిన యువకున్ని పోలీసులు అదుపులోకి తీసకున్నట్టు తెలిపారు.

You might also like