FbTelugu

డబుల్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

హైదరాబాద్: రాష్ట్రంలో వరుస హత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా లంగర్ హౌస్ లో డబుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. రౌడీషీటర్ చాంద్, అతని స్నేహితున్ని పాత కక్షలతో అర్షద్ గ్యాంగ్ నరికి చంపినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు.

ఈ కేసుకు సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు రౌడీషీటర్ అర్షద్ గా తెలిపారు. అర్షద్ తో పాటూ మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. పరారీలో మరో ముగ్గురు నిందితులు ఉన్నట్టు తెలిపారు.

You might also like