FbTelugu

ఊరెళ్ళేందుకు అనుమతిస్తున్న పోలీసులు

హైదరాబాద్: హాస్టళ్లలో ఉండే విద్యార్థులు, వర్కింగ్ మెన్స్, వర్కింగ్ విమెన్స్ కు ఊరట లభించింది. సొంత గ్రామాలకు వెళ్లేందుకు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి అనుమతించారు.

త్వరలోనే కర్ఫ్యూ అమలుచేసే పరిస్థితులు కన్పించడంతో నగరంలోని పలు హాస్టళ్ల యజమానులు బోర్డర్లను ఖాళీ చేయాలంటూ రాత్రి హుకుం జారీ చేశారు. ఇవాళ ఉదయం కూడా మళ్ళీ హెచ్చరించడంతో హాస్టళ్లలో ఉంటున్న వందలాది మంది పోలీసు స్టేషన్ కు పరుగులు పెట్టారు.

కొండాపూర్, మాదాపూర్, పంజగుట్ట, ఎస్.ఆర్.నగర్, కేపీహెచ్ బీ తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. పోలీసు స్టేషన్ల ముందు వందలాది మంది విద్యార్థులు బారులు తీరారని మీడియాలో రావడంతో డీజీపీ మహేందర్ రెడ్డి అప్రమత్తమయ్యారు.

స్వంత వాహనాలు ఉన్నవారిని అనుమతించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఉద్యోగులకు కంపెనీలే వాహనాలు సమకూర్చాలని ఆయన ఆదేశించారు. స్వగ్రామలకు వెళ్లాల్సిన వాళ్లకు పాస్ లు జారీ చేయాలన్నారు. అయితే స్వంత వాహనాలు లేని వారిపై స్పష్టత ఇవ్వలేదు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More