హైదరాబాద్: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ యువకుడు బైక్ పై వెళుతుండగా అడ్డుకున్నందుకు పోలీసులపై బూతులతో తిరగబడ్డాడు. ఈ ఘటన నగరంలోని లంగర్ హైస్ లో చోటుచేసుకుంది.
తన బైకును ఆపితే పోలీసుల అంతుచూస్తానని విరుచుకు పడ్డాడు. తాను పెట్రోల్ పోసుకొని పోవడానికి వచ్చానని ఎందుకు ఆపుతున్నారంటూ.. అల్లాటప్పాగాడినని అనుకుంటున్నారా అంటూ వాగ్వాదానికి దిగాడు.